తెలంగాణలో రేపే ఎంసెట్ ఫలితాలు

తెలంగాణలో రేపే ఎంసెట్ ఫలితాలు

తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్డీయూహెచ్‌లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రో. పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్‌ వీసీ వేణుగోపాల్‌ రెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ యాదయ్య ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటన విడుదల చేసింది.