తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. హైదరాబాద్ జేఎన్టీయూలని యూజీసీ- హెచ్ఆర్‌డీసీ ఆడిటోరియంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రో. పాపిరెడ్డి, జేఎన్‌టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి విడుదల చేశారు. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్‌ సెకండియర్‌లో ప్రవేశం కోసం మే 11న టీఎస్‌ ఈసెట్‌-2019 ప్రవేశపరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీల్లో 85 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసెట్ పరీక్షకు 28,037 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 27,123 (96.74 %) మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ నుంచి 25,034 మంది అభ్యర్థులు, ఏపీ నుంచి 2,089 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.