తిరుపతిరావు రిపోర్ట్ అమలుపై విద్యాశాఖ కసరత్తు

తిరుపతిరావు రిపోర్ట్ అమలుపై విద్యాశాఖ కసరత్తు

తిరుపతి రావు కమిటీ రిపోర్టు అమలుపై కసరత్తు మొదలు పెట్టింది తెలంగాణ విద్యా శాఖ.. రీసెంట్‌గా కమిటీ రిపోర్ట్ పై రివ్యూ చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కమిటీ సిపార్సుల అమలు సాధ్యాసాధ్యాలు.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుండైన అమలు చేయాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది.. అన్ని స్కూల్స్ కి స్కూల్ వైజ్ గా ఫీజులు నిర్ధారించడం అంత ఈజీ కాదనే అభిప్రాయంతో విద్యాశాఖ జిల్లా స్థాయిలో నియంత్రణ కమిటీలు వేయాలనే ఆలోచనలో ఉంది.. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులు నిర్ధారించాలనే దానిపై దృష్టి పెట్టారు.. పారామీటర్స్ ఆధారంగానే ఫీజులు...! వాటినే బట్టే ప్రతి ఏడాది ఎంత శాతం ఫీజులు పెంచుకోవచ్చో అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

కాగా, 2017 మార్చి 21న ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మార్గ దర్శకాల కోసం ఓయూ మాజీ వీసీ తిరుపతి రావు అధ్యక్షతన కమిటీ వేసింది ప్రభుత్వం.. 2017 డిసెంబర్‌ 30న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది తిరుపతిరావు కమిటీ.. అయితే, 2018 మార్చి 19న తిరుపతిరావు కమిటీ గడువును మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వుల జారీ చేసింది సర్కార్.. ప్రభుత్వం 2018 జూన్‌ 30న అడిగిన సందేహాలపై కమిటీ వివరణ ఇవ్వగా.. అప్పటి నుండి కమిటీ సిపార్సులను అమలు చేయాలని పేరెంట్స్, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.. మొత్తంగా ఇప్పుడు విద్యాశాఖ ఆ రిపోర్ట్ అమలుపై ఫోకస్ పెట్టింది.