ఇంటర్‌ ఫలితాలపై ఆందోళన వద్దు..

ఇంటర్‌ ఫలితాలపై ఆందోళన వద్దు..

ఇంటర్మీడియట్ ఫలితాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి... బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇష్యూపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై ఆందోళనలు వద్దు.. ఇంకా 25 తేదీ వరకు సమయం ఉంది, నిన్నటి వరకు 9 వేల అప్లికేషన్లు వచ్చాయి, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.. రీ వెరిఫికేషన్‌కు రూ.600లు, రీకౌంటింగ్‌కు రూ.100 కట్టి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఇక ఇంటర్‌ ఫలితాల సాఫ్ట్ వేర్ పై వస్తున్న వార్తలపై కమిటీ విచారణ కొనసాగుతోందన్న జనార్ధన్‌రెడ్డి.. కమిటీ నివేదిక వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఓ ఎమ్మార్ షీట్‌లో తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, గతంలో ఉన్న చట్టాల కంటే కొత్త చట్టాల ద్వారా వారిని శిక్షిస్తాం, వారికి ఫైన్ కూడా పెంచుతామని తెలిపారు. 

ఆత్మహత్యలు వద్దు..
వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు జనార్ధన్‌రెడ్డి... ఆత్మహత్యలు ఎవ్వరు చేసుకోవద్దు, అపజయం పాలైతే.. మళ్లీ ఎగ్జామ్ రాసుకోవచ్చు... కానీ, ప్రాణం పోతే మళ్లీరాదని విద్యార్థులకు ధైర్యాన్ని చెప్పారు. ఒక వేళ మూల్యాంకనంలో తప్పులు జరిగితే మీకు న్యాయం జరుగుతుంది.. కానీ. మీరు పరీక్ష రాయడంలో తప్పులు జరిగి ఫెయిల్ అయితే ఇతర చదువులు ఉన్నాయని సూచించారు. ఎక్కడ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దన జనార్ధన్‌రెడ్డి.. తల్లితండ్రులు కూడా పిల్లలను గమనించాలని కోరారు. మరోవైపు రాబోయే విద్య సంవత్సరం నుండి ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక్క స్వశక్తి సంఘం ఏర్పాటు చేస్తాం.. దీని ద్వారా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఒకరికోకరు చెప్పుకోవచ్చు అని వెల్లడించారు.