గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం !

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం !

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల పై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అయినట్టు తెలుస్తోంది. అలానే ఎన్నికల నిర్వహణ పై సమీక్ష నిర్వహించినట్టు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు చేయాల్సిన పనులపై ఈ సమీక్షలో చర్చించినట్టు చెబుతున్నారు. గ్రేటర్ అధికారులకు ట్రైనింగ్  కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఆన ఆదేశించినట్టు చెబుతున్నారు.  

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు CGG సహకారం తో సాంకేతికత ను ఎక్కువగా ఉపయోగించాలని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.. గత ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాలని, అయితే బ్యాలెట్ ద్వారా నిర్వహించాలా, లేక ఈవీఎంల ద్వారా నిర్వహించాలా అనే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో 8 వందలకు మించకుండా ఓటర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.