మోగిన తెలంగాణ "మున్సిపోల్స్" నగరా

మోగిన తెలంగాణ "మున్సిపోల్స్" నగరా

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. మున్నిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మొత్తం 120 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 30న వార్డుల వారీ ఓట్ల జాబితా ముసాయిదా విడుదల చేయనుంది. ముసాయిదాపై వచ్చేనెల రెండో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 31న జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చే నెల నాలుగో తేదీన వార్డుల వారీ తుది జాబితాను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.  

జనవరి 1న మున్సిపల్‌ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది. జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం, వివరణ ఇస్తారు. జనవరి 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు. ఇక నేటి నుండి తెలంగాణాలో ఎన్నికల కోడ్ అందుబాటులోకి వచ్చింది. ఇక జనవరి 5న మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అలాగే 6న వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జనవరి7న నోటిఫికేషన్ విడుదల చేసి 8 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం 11న నామినేషన్ల పరిశీలన జరిపి 12, 13 తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఇక 14న నామినేషన్ల ఉపసంహరణ జరిపి 22న పోలింగ్ కి వెళ్లనున్నారు. ఇక 25న కౌంటింగ్ జరిపి ఆరోజునే ఫలితాలు వెల్లడించనున్నారు.