రెండో రోజు 39 నామినేషన్లు దాఖలు

రెండో రోజు 39 నామినేషన్లు దాఖలు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజు వివిధ పార్టీలకు చెందిన 39 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారు రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ల సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. నామినేషన్లు వేసిన దగ్గర నుంచి అభ్యర్థులు ఖర్చు వివరాలు తెలపాలని సూచించారు. అఫిడవిట్‌లో బ్లాంక్‌ ఉంటే నామినేషన్‌ తిరస్కరించడం ఉండదని పేర్కొన్నారు. ఏదైనా కాలమ్‌ ఫిల్‌ చేయకుంటే ఆర్వో అభ్యర్థికి సూచించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సూచించారు.