తెలంగాణ పోలింగ్...

 

#ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకధీరుడు

#ఓటు హక్కును వినియోగించుకున్న కవచం హీరో బెల్లంకొండ శ్రీనివాస్

# ఓటు వేసిన చల్లా మల్లారెడ్డి దంపతులు

#1 గంటకు పోలింగ్‌ శాతంః తెలంగాణలో 48.09 శాతం... రాజస్థాన్‌లో 41.37 శాతం

# వంశీ చంద్ రెడ్డి ని నిమ్స్ లో పరామర్శించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి

# ఓటు హక్కును వినియోగించుకున్న హీరోయిన్ ఛార్మీ. 

#  ఓటు హక్కును వినియోగించుకున్న కమీడియన్ అలీ. 

# ఓటు హక్కును వినియోగించుకున్న నటుడు బ్రహ్మాజీ. 

# టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

# టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

# టాలీవుడ్ 'యంగ్ టైగర్' ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ తో పాటు ఆయన తల్లి, సతీమణి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

# టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు తమ స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి కూడా ఓటు హక్కుని  వినియోగించుకున్నారు. 

# ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం తన వేలికున్న సిరాను చూపుతూ 'నాపై రంగు పడింది' అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

# టాలీవుడ్ 'ప్రిన్స్' మహేష్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి నమ్రతతో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. మహేష్ కొద్దిసేపేపు క్యూ లైన్ లో నిలబడ్డారు. అక్కడ ఫ్యాన్స్ హడావుడి చేయడంతో.. అధికారులు లోపలికి తీసుకెళ్లి ఓటు వేయించారు. 

# బంజారాహిల్స్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ.  

# శేరిలింగంపల్లి నియోజకవర్గం నానకరాంగూడలో బూత్ నెంబర్ 19లో ఓటు హక్కును వినియోగించుకున్న సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్. 

# సికింద్రాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎలక్షన్ స్టార్ క్యంపైనర్ అభినయ. 

# కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి. 

# హైద్రాబాద్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

# రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని వర్థమమ్ స్కూల్ మహామందిర్‌‌లో ఆయన ఓటు వేశారు. జోధ్‌పూర్‌లోని సర్దార్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీచేస్తున్నారు. 

# కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి హెలికాప్టర్ లో చింతమడకకు బయలుదేరనున్న సీఎం కేసీఆర్. 12 గంటలకు చింతమడకకు చెరుకొని ఓటు హక్కు వినియోగించుకొనున్న సీఎం కేసీఆర్ దంపతులు.

# నటుడు శ్రీకాంత్, ఊహల కుమారుడు రోషన్ జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ బూత్ కు తల్లిదండ్రులతో కలసి వచ్చి ఓటు వేశాడు.అనంతరం తన వేలిపై ఉన్న ఇంక్ ను చూపుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. మొట్టమొదటిసారి తనకు నచ్చిన వారికి ఓటు వేయడం ఎంతో ఆనందంగా ఉందని రోషన్ తెలిపాడు. 

# బ్రేకింగ్:
నల్గొండ జిల్లా కోదాడ రంగాపురం తండాలో ఇప్పటికీ పోలింగ్ ప్రారంభం కాలేదు. పోలింగ్ మొదలై 4 గంటలు అవుతున్నా కూడా ఓటు వేయటానికి గ్రామస్తులు ముందుకు రాలేదు. తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోలేదంటూ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. 

# సోమ్మసిల్లిపడిపోయిన కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి.

# రాష్ట్రవ్యాప్తంగా 23.17 శాతం పోలింగ్ నమోదు. 

# అబిడ్స్ జిపిఓలోని పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ .

# తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఓటు వేయటం కోసం లైన్లో నిలుచున్నారు. 

# అల్వాల్ భూదేవి నగర్ సెయింట్ కాన్వెంట్ స్కూల్ లో 70 సంవత్సరాల తరువాత తన సతీమణి విమలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజా గాయకుడు గద్దర్. 

# ఈ రోజు ఉదయం11:30 కు చింతమడక గ్రామంకు కేసీఆర్ వచ్చి తన ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. 

# ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అనాజ్ పూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న రామోజీరావు మరియ అతని కుటుంబ సభ్యులు. 

# హిమాయత్ నగర్ లోని సెయింట్ అంతోనిస్ హై స్కూలులో మంత్రి కేటీఆర్ సతీమణి కల్వకుంట్ల శైలిమ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

# ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల లలిత మాక్లూర్ మండల కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 

# కేసీఆర్ ఊరు చింతమడకలో కొనసాగుతున్న పోలింగ్. పోలింగ్ స్టేట్షన్ ల వద్ద బారులు తీరిన ఓటర్లు. 

# జుక్కల్ బీజేపీ అభ్యర్థి అరుణ తార తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 

# రంగారెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని వట్టిపల్లి సెంట్ ఫైజ్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.

# సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారాన్ని నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం. ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం నుండి బయటికి పంపించిన సిబ్బంది. 

# నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 105 వ నంబరు  పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయించడంతో ఇంకా ప్రారంభం కాని పోలింగ్.

# వనపర్తిలో తమవార్డ్ ను ఏనాయకుడు అబివృద్ది చేయలేదంటూ ఓటింగ్ ను బహిస్కరించిన వస్యనాయక్ తాండవాసులు.

# మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా. చెన్నూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సీపీ సత్యనారాయణ. 

# నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం పోతాంగల్ లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ కవిత.

# తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్ రాజానగర్‌ పోలింగ్ బూత్‌లో ఉదయాన్నే ఓటు వేశారు. 

# నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రంలో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు.

# సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు. 

# సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. 

# జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 7.8% ఓటింగ్ శాతం నమోదు. 

# కరీంనగర్ జిల్లా కేంద్రం కాశ్మీర్ గడ్డ రైతుబజార్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తన ఓటు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్. 

# కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రజా కూటమి అభ్యర్థి చాడ వెంకటరెడ్డి. 

# తార్నాక పోలింగ్ బూత్ 181 లో క్యూ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న ప్రో. కోందండరాం దంపతులు. 

# వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15% పోలింగ్ నమోదు. 

# 9 గంటల సమయానికి కొడంగల్ లో 16 శాతం పోలింగ్ నమోదు. 

# నల్గొండలో ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటేశారు. 

# ఓటు వేయడానికి కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్ కు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రజలతో కలిసి ఎన్టీఆర్ క్యూ లైన్ లో నిల్చున్నారు . 

# జూబ్లీ హిల్స్ రోడ్డు ఐదులోని యూరో కిడ్స్ స్కూల్ లో ఓటేసిన కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి. 

# అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 

# రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం ఉప్పర్ పల్లిలోని పోలింగ్ బూత్ లో శివ గౌడ్ అనే వ్యక్తి తన ఓటును వినియోగించుకుని పోలింగ్ బూత్ లో తన ఫోటో తీసుకొని షేర్ చేసాడు. ఈ ఘటనతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మొబైల్ కు పోలింగ్ బూత్ లో అనుమతి లేకున్నా.. తీసుకెళ్లి ఫొటోలు పెట్టడం జరిగింది. 

# ఈవీఎంల సమస్య కారణంగా 20 కేంద్రాల్లో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అధికారులు ఈవీఎంలను సరిచేస్తున్నా.. అవి పనిచేయడం లేదు. 

# తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదు అయింది. 

# నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఓటర్లు తమ ఓటు హక్కు గల్లంతయిందని ఆర్మూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. 

# హైదరాబాద్ లోని మల్లాపూర్ జన్సీ స్కూల్ 143 పోలింగ్ కేంద్రంలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. 

# 214 పోలింగ్ బూత్ లో కరెంటు లేక పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇక చేసేదేంలేక సెల్ ఫోన్ తో పనిస్తున్నారు. 

# టీజేఎస్ అధినేత కోదండరామ్ తార్నాకలో తన ఓటును వినియోగించుకునేందుకు వేచి ఉన్నారు. 

# ఓటేసిన అనంతరం హరీష్ రావు 

# ఓటేసిన అనంతరం నాగార్జున సెల్ఫీ

# ఓటేసిన సింధు, గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ లు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాను ఓటేశానని పుల్లెల గోపీచంద్ తన వేలుపై సిరాగుర్తును చూపించగా.. పీవీ సింధూ తన ఓటరు కార్డును చూపించారు.

# ఖమ్మం పట్టణంలోని నెహ్రూనగర్ లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

# ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం గొల్లగూడెంలో మంత్రి తుమ్మల ఓటు వేశారు. 

# ఆర్మూర్ నియజకవర్గo మామిడిపల్లిలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న టీఆరెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి.

# మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో సహా జూబ్లిహిల్స్ పోలింగ్ స్టేషన్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామ్ చరణ్ తప్ప తమ కుటుంబ సభ్యులు అందరూ ఓటు వేస్తున్నట్లు చిరంజీవి చెప్పారు.

# రమా రాజమౌళి ఓటు గల్లంతు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 19 లో సినీ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తన ఓటును వినియోగించుకున్నారు. అయితే ఆయన సతీమణి రమా రాజమౌళికి ఓటు లేకపోవడంతో నిరాశగా వెనక్కి తిరిగారు. 

# మెదక్ జిల్లా శివంపేట(మ) గోమారంలో ఓటుహక్కు వినియోగించుకున్న మాజీమంత్రి సునిత లక్ష్మారెడ్డి.

# రాజస్థాన్‌లో మందకొడిగా ప్రారంభమయిన పోలింగ్‌. 

# నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. ఈవీఎం మిషన్స్ వద్ద లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల ఎవరికి ఓటు వేస్తూన్నామో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . 

# జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నత్ పూర్ లో గంట లేటుగా ప్రారంభమైన ఈవీఎంలు. 

# శేరిలింగంపల్లి పోలింగ్ బూత్ 511 లో మొరాయిస్తున్న ఈవీఎంలు. దీంతో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపుడి గాంధీ క్యూ లైన్ లో నిలుచున్నారు.

# తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంత గ్రామమైన కొండారెడ్డి పల్లెలో ఆయన ఓటు వేశారు. రేవంత్‌రెడ్డి వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నవిషయం తెలిసిందే. 

# కరీంనగర్ జిల్లా ఎంపీ వినోద్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం ఉర్థూ మీడియం పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 

# తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 

# టాలీవుడ్ 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ ఓటు హక్కుని వినియోగించుకోడానికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటు వేయడానికి ప్రజలతో కలిసి ఆయన క్యూ లైన్ లో నిలుచున్నారు. 

# కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఆమె మెహిదీపట్నంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

 

 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 

 • # టాలీవుడ్ 'కింగ్' నాగార్జున తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జునతో పాటు అమల కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 • మోత్కుపల్లికి ఛాతి నొప్పి
 • హైదరాబాద్‌కు తరలింపు
 •  ఎల్బీనగర్ నగర్ నియోజకవర్గం హయత్ నగర్ లో ఓటర్ల ఆందోళన. 

# భూపాలపల్లిలోని జెడ్పీ హైస్కూల్‌లో వీవీప్యాట్ మొరాయించడంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. వీవీప్యాట్‌ను సరిచేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే పోలింగ్ బూత్‌ వద్ద ఓటర్లు బారులు తీరారు. 

# బడంగ్ పేటలో ప్రారంభం కాని పోలింగ్. ఏర్పాట్లు సరిగా లేవంటూ ఓటర్లు ఫిర్యాదు చేస్తున్నారు. 

# టీఆర్ఎస్ పాలేరు నియోజవర్గం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ రోజు ఉదయం గొల్లగూడెంలో తుమ్మల ఓటు వేశారు.

# జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ ఓటే వేసేందుకు వచ్చారు. అయితే అక్కడి ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటు వేసేందుకు ఆయన వేచి చూస్తున్నారు. 

# రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఈవీఎంల సమస్యలు. 

# కూకట్ పల్లిలో పనిచేయని ఈవీఎంలు. 

# స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం శివునిపల్లిలో ప్రారంభం కాని పోలింగ్. 

# ఓటు హక్కు వినియోగించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులు.

# ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది. ప్రతీఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హరీష్‌రావు కోరారు. 

# కొడంగల్ లో ఇంకా ప్రారంభం కాని పోలింగ్. ఈవీఎంలలో సమస్యలు ఉన్న కారణంగా పోలింగ్ ప్రారంభం కాలేదు. సరిచేస్తున్న అధికారులు. 

# ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో మంత్రి తుమ్మల, సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి, బంజారాహిల్స్ లో కేవీపీ, ఉప్పల్ అభ్యర్ధి వీరేంద్ర గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

# సిద్ధిపేటలో హరీష్‌రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

# తెలంగాణలో పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఈ సారి ఎన్నికల్లో వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. దీంతో ఓటరు తాను వేసిన వ్యక్తికే తన ఓటు పడిందో లేదో తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలో ఉన్నఅభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

# 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది.

#  రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుండగా, 2.81 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.41 కోట్ల మంది పురుష ఓటర్లు, 1.40 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 7.5 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓటు వేయనున్నారు.