మోడీకన్నా... మద్యం సాయం.. మిన్న

మోడీకన్నా... మద్యం సాయం.. మిన్న

ధనిక రాష్ట్రంలో మద్యం ఎరులైపారుతోంది. ఎక్సైజ్‌ శాఖ కలెక్షన్ష్‌ ముందు ఇతర శాఖలు చిన్నబోతున్నాయి.  ఖజానాకు వచ్చే ఆదాయం వందల నుంచి వేల కోట్లకు చేరింది.  మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి వద్దంటే డబ్బు.  లిక్కర్ సేల్ లో రికార్డులు బద్ధలు చేస్తోంది.    అమ్మకాల్లో తన రికార్డులను తానే అధికమిస్తోంది.  ఈ స్థాయి లెక్కలు చూసిన ఎక్సైజ్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు.  టార్గెట్ మించడం సాధారణమైపోయింది. తెలంగాణ సర్కారుకు డబ్బే డబ్బు. ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోత కూడా అదే రేంజ్‌లో ఉంది. చల్లగా ఓ బీరు ఏస్తే పోలా? అని మందుబాబులు అనుకుంటాన్నారో ఏమో అమ్మకాలను వైన్ , విస్కీలను బీర్‌  మించిపోయింది. ఈ రేంజ్ అమ్మకాలు చూసి రాష్ట్ర ఉన్నతాధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. 

మందు బాబులు పండుగ చేసుకుంటున్నారు. సీజన్‌ ఏదైనా మందు ధర్మం పాటిస్తున్నారు. ఇక  మందు దొరుకుందో లేదో అన్నంతగా తెగ తాగేస్తున్నారు.   అమ్మకాలతో  హైదరాబాద్‌ది కొత్త రికార్డు.   రాష్ట్ర ఎక్సైజ్ శాఖ  ఆదాయం పెరగడం రివాజుగా మారింది. 

2016-17 ఆర్థిక సంవత్సరం శుభారంభం చేసింది. తొలి నెల ఏప్రిల్ లో రూ.200కోట్లకుపైగా ఆదాయ సమకూరింది. ఏడాది దాటేసరికల్లా ఏప్రిల్‌ ఆదాయం  డబుల్ అయ్యింది. అంటే 400 కోట్లకు పైగా అన్నమాట. మరో ఆసక్తికర విషయం ఏమంటే ఈ మొత్తం ఈ ఏడాది కలెక్షన్స్‌లో అదే కనిష్ట ఆదాయం. అంటే అక్కడి నుంచి వైన్‌ అమ్మకాలది దూకుడేనన్నమాట. ప్రతి నెలా ఆదాయం అంతకంతకు పెరిగింది. 2017-18 మే లో రూ. 955.62కోట్లు.... జూన్ రూ.597.31 కోట్లు.. జూలై రూ.649.56 కోట్లకు చేరింది. ఆగస్ట్ రూ.675.15కోట్లుకు చేరిన ఆదాయం అక్టోబర్ లో డబుల్‌ దాటింది. ఈ నెలలో ఆల్‌ టైమ్‌ రికార్డుస్థాయిలో  రూ.1,411.83 కోట్లకు చేరింది. తరవాత తగ్గిన ట్రెండ్‌ మాత్రం కొనసాగింది. జనవరిలో అమ్మకాలు మళ్ళీ వెయ్యి కోట్లు దాటాయి.

మోడీ సాయం కన్నా...2017-18 ఏడాదికి లక్షా 45 వేల కోట్ల కలెక్షన్స్‌ సాధించాలని తెలంగాణ నిర్ణయించినా... 79.72శాతానికే కలెక్షన్స్‌ పరిమితం కావడానికి ప్రధాన కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇన్‌  ఎయిడ్స్‌, నిధులు తగ్గడమే.  రూ. 26,857 కోట్లు ఈ పద్దు కింద వస్తాయని అంచనా వేయగా...  2017-18లో వచ్చింది కేవలం రూ. 8,041 కోట్లు మాత్రమే ఉంటాయని కాగ్‌ అంటోంది. అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గినందునే నిర్ణీత లక్ష్యం సాధించలేకపోయింది. కాని మద్యం మాత్రం తన టార్గెట్‌ను ఈజీగా దాటేసింది.ఇతర శాఖల్లో స్టాంపులు రిజిస్ర్టేషన్‌ ఫీజులు కూడా రికార్డు స్థాయిలో 140 శాతం  కలెక్షన్స్‌ సాధించింది.

ఇది రాష్ట్ర ఆర్థిక స్థితి 

 

గత ఆర్థిక సంవత్సరం అంటే 2017-18లో అద్భుత ప్రగతి సాధించిన శాఖ ఏదైనా ఉందంటే భూముల తరవాత ఎక్సైజ్‌ శాఖే. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ నిర్ణయించిన టార్గెట్‌ను ఈజీగా దాటేసింది.   మార్చి నెలలో రూ. 874 కోట్లు ఉంటాయని కాగ్‌  అంచనా వేసింది. దీంతో మొత్తం ఏడాదికి రూ. 9,421 కోట్ల విలువైన మద్యాన్ని తెలంగాణలో అమ్మారు. ఆర్థిక మంత్రి నిర్ణయించిన టార్గెట్‌ రూ. 9000 కోట్లు. అమ్మకాల్లో ప్రతి నెలా కొత్త రికార్డు సృష్టించింది ఎక్సైజ్‌ శాఖ.

ఇది బాటిల్‌ కలెక్షన్స్‌ 

జీహెచ్‌ఎంసీ పరిధిలోని మద్యం దుకాణాల్లో ఐఎంఎల్ మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు పరుగులు తీస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలు ఇంత భారీగా ఉండటానికి కారణాలు లేకపోలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఏపీ నుంచి కూడా జనం భారీగానే వస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరగడానికి ఇది కూడా కారణమే. కాని మెజారిటీ ఆదాయం స్థానికుల నుంచి పిండుతున్నదే. 

తెలంగాణలో కొన్ని వైన్ షాప్ ల వ‌ద్ద చాంతాడంత క్యూలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా స్వైపింగ్ మిష‌న్లు ఉన్న మ‌ద్యం దుకాణాల్లో మరింత దూకుడుగా అమ్మకాలు జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ మద్యం ఆదాయంలో వెనక్కి తగ్గడం లేదు. తమిళనాడులో ప్రభుత్వ పరంగా విక్రయాలు చేపట్టినా ఆ రాష్ట్రం కన్నా తెలంగాణ ముందంజలో ఉండటం గమనార్హం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆది నుంచీ ఏపీకి దీటుగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించింది. అన్ని రకాలుగా పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. మిగతా రాష్ట్రాలకన్నా తెలంగాణలో లిక్కర్‌కన్నా బీరు వినియోగమే ఎక్కువ అని తాజా లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద లిక్కర్‌, బీరు అమ్మకాల ఆదాయంలో పొరుగు రాష్ట్రాలను మించిపోయింది తెలంగాణ.