తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల షెడ్యూల్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల షెడ్యూల్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల షెడ్యూల్‌ ఖరారైంది. జూన్‌ 2వ తేదీన  ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మార్చ్ పాస్ట్ లేకుండానే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.  పరేడ్ గ్రౌండ్ కు బదులుగా పబ్లిక్ గార్డెన్ లోని జూబిలీ హాల్ కు ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు.

షెడ్యూల్‌..

  • ఉదయం అమరవీరుల స్థూపానికి కేసీఆర్‌ నివాళులు
  • 9 గంటల నుంచి పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందన కార్యక్రమం 
  • ఉదయం 10.30లకు సీఎస్‌ ఆధ్వర్యంలో 'ఎట్‌ హోం' కార్యక్రమం 
  • 11 గంటలకు జూబ్లీ హాలులో రాష్ట్రావతరణ అంశంపై కవి సమ్మేళనం సాయంత్రం పురస్కార ప్రదానోత్సవం