ఆరో వసంతంలోకి తెలంగాణ

ఆరో వసంతంలోకి తెలంగాణ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు పూర్తయింది. ఆరో వసంతంలోకి కొత్త రాష్ట్రం అడుగిడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా  ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మొత్తం 3 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై డ్రోన్లతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

  • జూన్‌ 3న ఎల్బీ స్టేడియంలో 1001 మంది కళాకారులతో పేరిణి మహా నృత్య ప్రదర్శన.
  • జూన్‌ 4న 5000 మంది కళాకారులతో ఒగ్గు డోలు మహా విన్యాస ప్రదర్శన. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో పీపుల్స్‌ ప్లాజా, రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు.
  • జిల్లాల్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి డిప్యూటీ చైర్మన్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్‌లు, జడ్పీ చైర్‌పర్సన్లు జాతీయ జెండాను ఎగురవేస్తారు.