భవన నిర్మాణ నిబంధనలు సవరించిన సర్కార్..

భవన నిర్మాణ నిబంధనలు సవరించిన సర్కార్..

భవన నిర్మాణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది టీఆఎస్ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్.. జీవో నంబర్ 50ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల సంబంధించి కొన్ని నిబంధనలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసిన నేషనల్ బిల్డింగ్ కోడ్-2016కు అనుగుణంగా సవరించాలని బిల్డర్స్, డెవలపర్స్ అసోసియేషన్స్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో నిబంధనలకు సవరించింది సర్కార్.

ప్రభుత్వ ఉత్తర్వుల్లోని కీలక అంశాలు:
1. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గ్రీన్ హోమ్స్ నిబంధనల ప్రకారం రూముల వెంటిలేషన్‌కు అనుమతి.
2. నిబంధనల మేరకు టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి అనుమతి.
3. ఆక్యుపెన్సి సర్టిఫికెట్ జారీకి ముందే బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాతనే ఓసీ జారీ చేయాలి.
4. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, టీఎస్ ట్రాన్స్ కోలు కనెక్షన్ ల మంజూరు కోసం ఆక్యుపెన్సి జారీ కంటె ముందే ధరఖాస్తులు తీసుకొని, తుది కనెక్షన్లకు ఓసి జారీ చేసిన అనంతరం ఇవ్వాలి.
5. హైరైజ్ బిల్డింగులకు సెట్ బ్యాక్‌ను నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 ప్రకారం నిర్దారించారు.
6. రోడ్లు విస్తరణలో తమ స్ధలాలను అప్పిగించేలా ప్రోత్సహించడంలో భాగంగా ఫ్లోర్ టు ఫ్లోర్ ఎత్తు, భవనం టైపు మరియు నమూనా విస్తరణకు ముందు విస్తరణకు తరువాత ఒకే తరహాలో ఉండాల్సిన అవసరం లేదు. విస్తరణకు ముందు విస్తరణకు తరువాత బిల్డింగ్ ఏరియా అనుమతించిన మేరకు ఉండాలి.