గ్రామ పంచాయతీ కార్మికులకు దీపావళి కానుక..

గ్రామ పంచాయతీ కార్మికులకు దీపావళి కానుక..

దీపావళి పండగ ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాన్ని రూ. 8500కు పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సోమవారం జారీ చేశారు. అయితే, ఇప్పటి వరకు ఒక్కో పంచాయతీ కార్మికుల వేతనాలో ఒక్కో రకంగా ఉన్నాయి.. కాస్త నిధులున్న పంచాయతీల్లో కార్మికుల వేతనాలు పర్వాలేదు.. కానీ, చిన్న పంచాయతీల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అయితే, దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంచాయతీల్లో కార్మికులకు ఒకే రకమైన వేతనాలు ఉండేలా నిర్ణయం తీసుకుంది.