ఆర్టీసీ సమ్మె..! సర్కార్ మల్లగుల్లాలు..!?

ఆర్టీసీ సమ్మె..! సర్కార్ మల్లగుల్లాలు..!?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది.. రోజుకో రీతిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.. అయితే, హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై ఇటు ఆర్టీసీ కార్మికులు, అటు ప్రభుత్వానికి సైతం కీలక సూచనలు చేసింది. దీంతో... ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం ఒక కమిటీని వేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక వేళ కమిటీ వేస్తే మంత్రులతోటా? లేదా ఐఏఎస్‌లతో వేయాలా? అనే ఆలోచన చేస్తోంది. కమిటీ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వుల కోసం  ఎదురు చూస్తోంది సర్కార్‌. అలాగే కార్మికులతో చర్చలు వెంటనే మొదలు పెట్టి రెండ్రోజుల్లో పూర్తి చేయాలని న్యాయస్థానం సూచించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన ఆర్టీసీ కార్మికులు తాము చర్చలు సిద్ధమని ప్రకటించారు. అత్యవసరంగా సమావేశమైన ఆర్టీసీ జేఏసీ.. హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు.