గవర్నర్ మెచ్చిన 'సైరా'.. చిరంజీవిపై ప్రశంసలు..

గవర్నర్ మెచ్చిన 'సైరా'.. చిరంజీవిపై ప్రశంసలు..

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రశంసలతో పాటు.. వసూళ్లలోనూ సత్తా చాటుతోంది.. ఇక ఈ మధ్యే రాజ్‌భవన్‌ను వెళ్లే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ను కలిసిన చిరంజీవి.. "సైరా" చూడాల్సింది ఆహ్వానించారు. ఇవాళ గవర్నర్‌ కోసం ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 'సైరా' మూవీ ప్రత్యేక షో వేయించగా... కుటుంబసభ్యులతో కలిసి సైరా మూవీని తిలకించారు గవర్నర్.. ఈ షోకు చిరంజీవి, ఆయన కుమార్తె సుశ్మిత కూడా వచ్చి.. గవర్నర్‌కు ఆహ్వానం పలికి.. ఆమెతో పాటు సినిమాను చూశారు. షో అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్ "సైరా" మూవీ.. మెగాస్టార్ చిరంజీవి నటపై ప్రశంసలు కురిపించారు. 

సైరా సినిమా చాలా బాగుందన్న గవర్నర్ తమిళిసై.. గొప్ప చరిత్రకారుడు, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెలుసుకోవడం సంతోషంగా ఉందని.. ఇక, సినిమాలో చిరంజీవి.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు జీవం పోశారని ప్రశంసించారు. సినిమాలో చిరంజీవి కనిపించలేదని.. నరసింహారెడ్డినే చూసినట్టుందన్నారు. "సైరా" మూవీ యూనిట్‌కు మొత్తం అభినందనలు తెలిపారు గవర్నర్.