ఉద్యోగాల భర్తీకి టీ-సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఉద్యోగాల భర్తీకి టీ-సర్కార్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం 391 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విపత్తు నివారణ, పైర్ డిపార్ట్ మెంట్లలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిలో 33 స్టేషన్ ఫైర్ అధికారులు, 284 ఫైర్ మెన్, 18 జూనియర్ అసిస్టెంట్, 56 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. పోలీస్ నియామక బోర్డు ద్వారా స్టేషన్ ఫైర్ అధికారులు, ఫైర్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, శాఖా పరమైన ఎంపిక కమిటీ ద్వారా డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.