మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ఆదేశాలతో సీఎస్ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ సర్క్యూలర్ జారీ చేశారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందని సిఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కేంద్రంగా పని చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అని అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అంగన్వాడీ, ఆశావర్కర్లకు వేతనాల పెంపు సహా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వి-హబ్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)