సర్పంచ్, ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ 

సర్పంచ్, ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ 

తెలంగాణలో గ్రామపంచాయతీలకు చెక్‌పవర్‌ నోటిఫికేషన్‌‌ను ప్రభుత్వం జారీ చేసింది. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్‌ను ప్రభుత్వం కల్పించింది. దీనికి సంబంధించి శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రామ పంచాయతీల్లోని ఆడిటింగ్‌ బాధ్యతలు సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన పంచాయతీ రాజ్‌ చట్టంలో సర్పంచులతో పాటు, ఉప సర్పంచులకు సంయుక్తంగా చెక్‌పవర్‌ కల్పించింది. పంచాయతీ రాజ్‌ చట్టం-2018లోని చెక్‌ పవర్‌కు సంబంధించి సెక్షన్లను ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసింది. దీని ప్రకారం గ్రామపంచాయతీ నిధులకు సంబంధించి ఇద్దరికీ సంయుక్తంగా చెక్‌ పవర్‌ లభిస్తుంది.