ఆర్టీసీ కార్మికులకు గట్టి ఎదురుదెబ్బ

ఆర్టీసీ కార్మికులకు గట్టి ఎదురుదెబ్బ

ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది…ఆర్టీసీలో 5100 బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కెసిఆర్ క్యాబినేట్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టి వేసింది. రూట్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల తరఫున ప్రొఫెసర్ కె.ఎల్. విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం నేది విచారణ చేపట్టి కేబినెట్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 102 ప్రకారం.. ప్రభుత్వానికి విశేష అధికారాలు ఉన్నాయని పేర్కొంది. రూట్ల ప్రైవేటీకరణ అంశంపై దాఖలైన రిట్ పిటిషన్‌తో పాటు ఇతర పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మూడు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. దీంతో ఆర్టీసీలో సగం పైగా రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించేందుకు మార్గం సుగమం అయింది.