దిశ నిందితుల ఎన్‌కౌంటర్... 50 శాతం కుళ్లిపోయిన మృతదేహాలు...!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్... 50 శాతం కుళ్లిపోయిన మృతదేహాలు...!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది... దేశ వ్యాప్తంగా ఈ ఎన్‌కౌంటర్ చర్చకు దారితీయగా... మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించకుండా... కోర్టులు బ్రేక్‌లు వేశాయి. అయితే, ఇప్పుడు ఆ మృతదేహాలను భద్రపర్చడం గాంధీ ఆస్పత్రికి పెద్ద సమస్యగా మారింది. ఇక, ఇవాళ దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ జరిగింది.. చీఫ్ జస్టిస్ ముందు హాజరైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్... మృతదేహాల భద్రతపై కోర్టుకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయని కోర్టుకు తెలిపిన ఆయన.. మైనస్ 2 డిగ్రీల సెల్సీయస్ ఫ్రీజర్‌లో మృతదేహాలను ఉంచాలని సూచించారు. అంతే కాదు.. మరో వారంపది రోజుల్లో మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయే పరిస్థితి ఉందని హైకోర్టుకు తెలిపారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్. ఇదే సమయంలో దేశంలో ఇతర ఆస్పత్రుల్లో మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉందా? అని హైకోర్టు ప్రశ్నించగా.. తెలియదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండ్ బదులిచ్చారు. ఇక, ఈ కేసులో హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.