దిశ నిందితుల ఎన్‌కౌంటర్... హైకోర్టు కీలక ఆదేశాలు...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్... హైకోర్టు కీలక ఆదేశాలు...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు... ఎన్‌కౌంటర్ ఘటనపై సాయంత్రం 6 గంటలకు అందిన పిటిషన్‌పై అత్యవసరంగా స్పందించిన హైకోర్టు... ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలని ఆదేశించింది. ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది హైకోర్టు.. మరోవైపు నిందితుల పోస్ట్‌మార్టంను వీడియో చిత్రీకరించి.. ఆ వీడియోను మహబూబ్‌నగర్ జిల్లా జడ్జికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.. ఈ నెల 9వ తేదీ వరకు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఆ నాలుగు మృతదేహాలు ఉంచాలని ఆదేశించింది. ఇక.. హైకోర్టు విచారణకు అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌. ప్రసాద్‌ హాజరయ్యారు.. గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ నిపుణుల బృందంతో పోస్ట్‌మార్టం జరిగిందని.. పోస్ట్‌మార్టంను వీడియో చిత్రీకరణ చేసినట్లు కోర్టుకు తెలిపారు ఏజీ..