ఐటీ గ్రిడ్స్ కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు

ఐటీ గ్రిడ్స్ కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు

ఐటీ గ్రిడ్స్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఐటీ గ్రిడ్స్ కేసులో ఎన్నికల అధికారులను ఇంప్లీడ్ చేయవద్దంటు దాఖలైన పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఇంప్లీడ్ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎన్నికల అధికారి, ఆధార్ అథారిటీ అధికారులు, ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, డేటా ఎన్‌రోలింగ్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్, లోకేశ్వర్ రెడ్డి తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది.