సమ్మె లీగలా..ఇల్లీగలా అని మేము చెప్పలేం !

సమ్మె లీగలా..ఇల్లీగలా అని మేము చెప్పలేం !

ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టులో వాడీవేడీగా వాదనలు జరిగాయి. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం తరఫున వాదనలు విన్పించారు సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్‌.  సమ్మె ఎస్సా పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్‌ ఆర్టీసీకి అని.. 2015లో ఇచ్చిన ఉత్తర్వులు ఆరునెలల వరకే అమల్లో ఉంటాయని పేర్కొంది. గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడెలా వర్తిసాయని ప్రశ్నించింది హైకోర్టు. చట్టానికి అతీతంగా నిర్ణయాలు తీసుకోలేమన్నది. సమ్మె లీగలా..ఇల్లిగలా అన్నది నిర్ణయించడం తమ పరిధిలో లేదన్నది హైకోర్టు. మరోవైపు బస్సుల్లో అధికఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలపగా.. దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధికఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.