ప్రభాస్ భూమిపై హైకోర్ట్ తీర్పు... ఏమందంటే...!!

ప్రభాస్ భూమిపై హైకోర్ట్ తీర్పు... ఏమందంటే...!!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.  లాక్ డౌన్ సందర్భంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.  అయితే, ప్రభాస్ కు రాయదుర్గంలో 2083 గజాల స్థలం ఉన్నది.  ఈ స్థలం ప్రస్తుతం వివాదంలో ఉన్నది.  ఈ స్థలం విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నది.  

గతేడాది ఏప్రిల్ 23 వ తేదీన హైకోర్టు దీనిపై తీర్పును ఇచ్చింది.  ఈ తీర్పు ప్రకారం, వివాదాస్పద భూమిని అలా ఉంచాలని, ఎవరికీ అప్పగించవద్దని పేర్కొన్నది.  అయితే, రంగారెడ్డి రెవిన్యూ అధికారులు రంగారెడ్డి కోర్టు నుంచి తీర్పును కాపీలను తీసుకొని స్వాధీనం చేసుకోవాలని చూడగా, ప్రభాస్ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు.  దీనిపై కోర్టు తీర్పును ఇచ్చింది.  గతేడాది ఇచ్చిన విధంగానే స్థలాన్ని యధాతధంగా ఉంచాలని చెప్పింది.  1958 వ సంవత్సరం నుంచి కూడా ఈ స్థలంపై వివాదం నెలకొన్నది.  అయితే, అక్రమదారులకు కొన్ని హక్కులు ఉంటాయని, స్థలం క్రమబద్దీకరణకు అనుమతి ఇస్తే, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, మిగతా హక్కుదారులు కూడా క్రమబద్దీకరణకు వస్తారని, దీని వలన ప్రభుత్వానికి ఆదాయం లభించడంతో పాటుగా సమస్య పరిష్కారం అవుతుందని కోర్టు పేర్కొన్నది.