వైఎస్ జగన్ కేసులపై ఉత్కంఠ..!?

వైఎస్ జగన్ కేసులపై ఉత్కంఠ..!?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులపై ఉత్కంఠ నెలకొంది.. ప్రతిక్ష నేతగా ఉన్న సమయంలో క్రమం తప్పకుండా కోర్టుకు హాజరైన వైఎస్ జగన్... ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బిజీ అయిపోయారు. దీంతో, పాలనా వ్యవహారాల దృష్ట్యా కోర్టుకు హాజరుకాలేనంటూ పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. అయితే వ్యక్తిగతంలో హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్. సీబీఐ, ఈడీ కేసులలో కోర్టుకి హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మినహాయింపు విషయంలో హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పిటిషన్లపై సీబీఐ, ఈడీ వాదనలు వినిపించాయి. ఈ కేసులో ఇవాళ హైకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది... దీంతో.. హైకోర్టు నేడు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది.