పిట్స్‌బర్గ్‌ వర్సిటీతో తెలంగాణ ఒప్పందం..

పిట్స్‌బర్గ్‌ వర్సిటీతో తెలంగాణ ఒప్పందం..

అమెరికాలోని ప్రముఖ యూనిర్సిటీ పిట్స్‌బర్గ్‌తో తెలంగాణ ఉన్నత విద్యా మండలి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. అమెరికాలోని టాప్ 5 యూనివర్సిటీల్లో పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ ఒకటి కాగా... ఆ యూనివర్సిటీ ఏ ఫీల్డ్స్ లో అడ్వాన్స్‌లో ఉన్నారో అవి తెలంగాణలోని యూనివర్సిటీలకు ఉపయోగపడతాయని పాపిరెడ్డి వెల్లడించారు. స్టూడెంట్స్, ఫ్యాకల్టీల పరస్పర మార్పు ఉంటుందని అని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి, రాజీశ్‌ శర్మలను కలిసిశారు పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ ప్రతినిధులు. కాగా, పిట్స్‌బర్గ్ వర్సిటీకి వైద్యరంగంలో మంచి పేరుంది. అందుకే వైద్యానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో వర్సిటీలను లేదా బ్రాంచీలను ప్రారంభించడానికి సాధ్యపడదు. పరిశోధన కేంద్రాలను మాత్రం నెలకొల్పుకోవచ్చు. అందుకే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం కొద్ది సంవత్సరాల క్రితం ఢిల్లీలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టుగానే ఇప్పుడు పిట్స్‌వర్గ్‌ వర్సిటీ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.