18న ఇంటర్ ఫలితాలు...

18న ఇంటర్ ఫలితాలు...

ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.. కానీ, తెలంగాణలో రిలీజ్ చేయలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన నెలకొంది. అయితే, ఈ నెల 18వ తేదీన ఇంటర్ ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ వార్షిక పరీక్షలు 2019 ఫలితాలను 18వ తేదీన నాంపల్లిలోని విద్యాభవన్‌లో విడుదల చేస్తామని ప్రకటన విడుదల చేశారు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్.