బీజేపీ నేతలు మాట్లాడితే నవ్వొస్తుంది.. టెంపుల్‌ పేరుతో మోసం వద్దు..!

బీజేపీ నేతలు మాట్లాడితే నవ్వొస్తుంది.. టెంపుల్‌ పేరుతో మోసం వద్దు..!

బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు తెలంగాణ మత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ నేతలు మాట్లాడితే నవ్వొస్తుంది అంటూ ఎద్దేవా చేవారు.. బీజేపీ నేతలకు రిక్వెస్ట్ చేస్తున్నాం... వరంగల్ ప్రజలను మోసం చేయొద్దన్న ఆయన.. టెంపుల్ పేరుతో మోసం చేయొద్దు.. వాస్తవాలు మాట్లాడుకుందాం.. దుబ్బాకలో మోసం చేశారు, హైదరాబాద్ లో మోసం చేశారు.. టెంపుల్ దగ్గర కాదు ఆఫీషల్ గా మాట్లాడుకుందాం.. కేంద్ర మంత్రిని పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టండి.. లేక పోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అయిన రివ్యూ మీటింగ్ పెట్టండి మేం కూడా వస్తాం.. కేంద్ర నుండి ఎన్ని నిధులు వచ్చాయి.. రాష్ట్రం నుండి ఎన్ని ఖర్చు చేశామో అధికారికంగా మాట్లాడుకుందాం అంటూ సవాల్ చేశారు. 

ఇక, తెలంగాణాకు ఎన్ని అవార్డు ఇచ్చారు.. ఆ అవార్డులు అన్ని మీరు ఇచ్చినవే కదా.. మరి ఇప్పుడే ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు ఎర్రబెల్లి.. సంక్షేమంలో నంబర్ వన్‌ తెలంగాణ రాష్ట్రమన్న ఆయన.. బేస్ లేనివాళ్లు దయచేసి మాట్లాడవద్దు.. అధికారికాంగ రండీ.. కలెక్టరేట్‌లో మాట్లాడుకుందాం అని సవాల్ విసిరారు.. చెన్నై. గుజరాత్‌కు వరద సహాయం ఇచ్చారు.. మరి వరంగల్, హైదరాబాద్ కి ఎందుకు ఇవ్వలేదు.. అధికారులు తప్పుడు పత్రాలను చూపెట్టారు కదా? అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దు అంటూ బండి సంజయ్‌కు సూచించిన ఎర్రబెల్లి.. కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదు.. రూ.5000 కోట్లతో పనులకు ప్రణాళిక సిద్ధం చేశాం.. మీరు రూ.2,500 కోట్లు సహాయం చేయండి..  అలా చేస్తే మోడీ పేరు పెడతామన్నారు. తెలంగాణపైన గాని, వరంగల్ పైన గానీ.. ప్రేమ ఉంటే నిధులు ఇవ్వండి... ఛాలెంజ్‌లు మంచి పద్ధతి కాదు అని హితవు పలికారు.