'పరిషత్ ఎన్నికలతో కాంగ్రెస్ కనుమరుగే..!'

'పరిషత్ ఎన్నికలతో కాంగ్రెస్ కనుమరుగే..!'

జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. జనగామ జిల్లా కొడకండ్లలో పరిషత్ ఎన్నికల సమన్వయ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ ఆదరణ కోల్పోయిందన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ కోల్పోతుందని జోస్యం చెప్పిన ఎర్రబెల్లి... కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కీలకపాత్ర పోషించబోతుందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. తెలంగాణ గ్రామాలు సమగ్రమైన అభివృద్ధి సాధించాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని.. అందుకోసం అంతా పనిచేయాలని సూచించారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న ఎర్రబెల్లి... కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు.