చంద్రబాబును పొలిమేర దాటిస్తే...

చంద్రబాబును పొలిమేర దాటిస్తే...

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును పొలిమేర దాటి పంపేస్తే... కాంగ్రెస్ పార్టీ  భుజాన వేసుకొని తిరుగుతుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కరెంట్ కావాలని అడిగిన పాపానికి చంద్రబాబు రైతుల్ని పిట్టల్లా కాల్చి చంపారని ఎన్నికల ప్రచార సభలో ఆయన ఆరోపించారు. కరెంట్ కోసం రైతుల్ని చంపిన చంద్రబాబు కావాలా... 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా మీరే తేల్చుకోవాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే... మళ్లీ పాత రోజులే.... కరెంటు కష్టాలే అని విమర్శించారు. తరిమికొట్టిన వలసవాదులతో జతకట్టి వస్తున్న కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఆంధ్రాబాబు ఇచ్చే నోట్ల కట్టలను కాంగ్రెస్ నమ్ముకుందని విమర్శించారు. కాలువల ద్వారా చెరువులు నిండితే పొలాల్లో జాలు పుట్టే రోజులు వస్తాయని పేర్కొన్నారు. ఇంటింటికి కృష్ణా, గోదావరి తాగునీరు త్వరలో అందిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.  24 గంటల కరెంట్ కావాలా అర్ధరాత్రి కరెంట్ కావాలా ప్రజలే తేల్చుకోవాల్సిన రోజులు వచ్చాయని హరీష్ రావు పేర్కొన్నారు.