పండుగలా కొత్త పంచాయతీల ఏర్పాటు...

పండుగలా కొత్త పంచాయతీల ఏర్పాటు...

కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటును ఆయా గ్రామాలలో ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు... నాల్గో విడత హరితహారం విజయవంతంపై సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన... తండాలను పంచాయతీలుగా చేస్తామని చెప్పిన గత ప్రభుత్వాలు వాటిపై దృష్టి పెట్టలేదని... ఇచ్చిన మాటకు కట్టుబడి పెద్ద సంఖ్యలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత టీఆర్ఎస్‌ సర్కార్‌దే అన్నారు. తండాలు గ్రామ పంచాయతీలు కావలన్న ఏళ్ల నాటి కలను కేవలం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిజం చేశారన్న హరీష్‌రావు... ఉమ్మడి మెదక్ జిల్లాలో రేపటి నుంచి 449 కొత్త గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీలు ఏర్పడుతున్నాయని... వీటితో అభివృద్ధికి బాటలు పడతాయని స్పష్టం చేశారు.