వెంటనే చర్యలు చేపట్టండి

వెంటనే చర్యలు చేపట్టండి

దాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, తడిసిన దాన్యం కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని తెలిపారు మంత్రి హరీష్ రావు. గత రెండు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తనికీలు చేస్తున్న హరీష్ రావు అకాల వర్షాలతో మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న పరస్థితిని ఈరోజు సమీక్షించారు. అలాగే... పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని మార్కెటింగ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.  

అంతేకాకుండా జిల్లా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, మార్కెటింగ్ అధికారులను, మార్క్ ఫెడ్ అధికారులను, వేర్ హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు కూడా. ఇంకా ఈ రోజు కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డుల్లో.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన సరుకుల గురించి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను.. మార్కెటింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టార్పాలిన్ లను వెంటనే సమకూర్చి తడవని సరుకులను వెంటనే గోదాంలకు తరలించే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. కొనుగోలు చేసిన దాన్యాన్ని ఏరోజుకారోజు వెంటనే గోదాములకు తరలించాలని ఆదేశించారు. గాలి దుమారానికి, భారీ వర్షానికి గోదాములపై ఉన్న రేకులు ఎగిరిపోయినందున వాటికి వెంటనే మరమ్మత్తులు చేయాలని  మార్కెటింగ్ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు.