ప్రధాని సూచనతో మేం తీసుకోలేదు-కేటీఆర్

ప్రధాని సూచనతో  మేం తీసుకోలేదు-కేటీఆర్

కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ప్రదాని నరేంద్ర మోడీ సూచనలతోనే మేం ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవడం లేదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్... హైదరాబాద్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముందుగా ప్రజా ప్రతినిధులు వాక్సిన్ తీసుకుని ప్రజల్లో నమ్మకం కలిగించాలని అనుకున్నాం అన్నారు.. కానీ, కోవిడ్ వారియర్స్‌కే ముందుగా వ్యాక్సిన్‌ వేయాలన్న ప్రధాని మోడీ సూచనతో  మేం కూడీ ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవడం లేదన్నారు.. వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చే దాకా వేచి ఉంటామన్న ఆయన... హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ హబ్‌గా మారిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక, కరోనా వ్యాక్సిన్‌ సురక్షితం.. ప్రజలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. కాగా, ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ఇవాళ దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతోంది.