ఎన్నికలంటే మాకు భయంలేదు...

ఎన్నికలంటే మాకు భయంలేదు...

2014 నుంచి ఏ ఎన్నికలు వచ్చిన టీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది... ఎలక్షన్ వస్తే భయపడాల్సింది మేం కాదు... ప్రజల్లో లేని కాంగ్రెస్ పార్టీ అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్...  ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ... పనిచేసే ముఖ్యమంత్రిని పది కాలాలు పాటు కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి రూ. 25 కోట్ల నిధులు ఇస్తామని ప్రకటించిన కేటీఆర్... కాయిత లంబడిలను ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం ఉంటే రాబోయే రోజుల్లో కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామన్నారు కేటీఆర్. 

యూఏఈ దౌత్య కార్యాలయం త్వరలో హైదరాబాద్ లో రాబోతుందన్నారు కేటీఆర్... కేవలం నాలుగేళ్లలో అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్న మంత్రి... తెలంగాణలోని ప్రతి ఎకరా సాగుభూమికి నీరు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము.... కేసీఆర్ రైతు కాబట్టే అన్ని సమస్యలు ఆయనకు తెలుసని... మా నాన్న ... అమ్మకు భూ నిర్వాసితుల బాధలు కూడా తెలుసన్నారు కేటీఆర్.