అది ఒక నరహంతక పార్టీ...  

అది ఒక నరహంతక పార్టీ...  

వందల మంది తెలంగాణ పోరాట యోధుల్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని... అది ఒక నరహంతక పార్టీ అని విమర్శించారు మంత్రి కేటీఆర్. రైస్ మిల్లర్స్ సమస్యలపై వారం, పది రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వస్తే విధ్వంసం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు గతంలో మాట్లాడారు? ఇప్పుడేమైంది. మొదటి ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను పరిష్కరించాం. ఇది నాయకత్వ పటిమ కాదా.? అని ఆయన అన్నారు. గతంలో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే... ఇప్పుడు దేశానికి ధాన్య బాంఢాగారం తెలంగాణ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  
కాంగ్రెస్ నేతల మాటలు చూస్తే ఆశ్చర్యమేస్తోందని..అరవై ఏళ్ల దరిద్రం అంటగట్టి... ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీ చెబితే.. ఇంకా కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ మోసం, దగాను ప్రజలకు వివరించాలని.. కాంగ్రెస్ లో పది మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని... అవినీతి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడంలా ఉందని తెలిపారు. ఆకాశం నుంచి పాతాళం దాకా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ది కుంభకోణాల చరిత్ర అని ఎద్దేవా చేశారు. కమిషన్లు మోసుడు కాంగ్రెస్ కు దద్దమ్మలకు తెలుసుకానీ టిఆర్ఎస్ కు తెలియదని వివరించారు. కొల్లాపూర్, దేవరకద్రకు చెందిన కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లి ప్రాజెక్టులపై కేసులు వేశారు. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ముందస్తు ఎన్నికలపై ఉత్తమ్ ది మేకపోతు గాంభీర్యమని.. పోచమ్మ గుడికి తీసుకువెళ్లిన మేకపోతు అలానే చేస్తుందని ఆయన వివరించారు.