హుజూర్‌నగర్ బైపోల్.. గెలిచేది ఎవరు..? కేటీఆర్ మాట..!

హుజూర్‌నగర్ బైపోల్.. గెలిచేది ఎవరు..? కేటీఆర్ మాట..!

తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ ముగిసింది.. ఇక, గెలుపుపై ఎవరి అంచనాలు వాళ్లకున్నాయి.. హుజూర్‌నగర్‌ ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీదే విజయమన్న కేటీఆర్. ఉప ఎన్నికల్లో పార్టీశ్రేణులు బాగా పనిచేశారంటూ ట్వీట్ చేశారు. కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సైదిరెడ్డి మంచి మెజార్టీతో గెలువబోతున్నట్లు ట్వీట్ చేశారు కేటీఆర్.