పాఠశాలలో మంత్రి సబిత ఆకస్మిక తనిఖీ

పాఠశాలలో మంత్రి సబిత ఆకస్మిక తనిఖీ

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.. ఇవాళ శివారెడ్డిపేట్‌ జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లిన మంత్రి.. పాఠశాలలోని తరగతి గదులకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు.. మధ్యాహ్నం భోజనం గురుంచి విద్యార్థులను అడిగి ఆరా తీశారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారని విద్యార్థులను అడిగిన మంత్రి సబిత.. రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజెన్స్‌ను గెస్ట్ ఉపాధ్యాయులుగా సేవలు వినియోగించుకోవాలని టీచర్లకు సూచించారు. ఇక, ప్రభుత్వం పాఠశాల విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. ప్రభుత్వ బడులను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతి నెల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు, విద్య వాలంటీర్ల జీతాలు కూడా చెల్లించనున్నట్లు, ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ఆర్ధికమంత్రి, ఆ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో వారి దృష్టికి తీసుకుకెళ్లినట్టు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.