చిరు, నాగ్‌తో మంత్రి తలసాని ప్రత్యేక భేటీ.. విషయం ఇదే..!

చిరు, నాగ్‌తో మంత్రి తలసాని ప్రత్యేక భేటీ.. విషయం ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునతో సమావేశమయ్యారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్... చిరంజీవి నివాసానికి వెళ్లిన తలసాని... అక్కడ చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారితో చర్చలు జరిపారు. ఈ భేటీ ప్రముఖంగా నంది అవార్డుల గురించి అని తెలుస్తోంది. నంది అవార్డులతో పాటు సినీ పరిశ్రమలోని కార్మికుల సమస్యలు, పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి? వీటిలో సాధ్యం అయ్యేవి ఏంటి? కానివి ఏంటి? అనే అంశాలపై చర్చించినట్టుగా సమాచారం.