'చంద్రబాబులో స్పష్టంగా ఓటమి భయం'

'చంద్రబాబులో స్పష్టంగా ఓటమి భయం'

ఏపీ సీఎం చంద్రబాబులో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... ఏపీలో జరిగిన ఎన్నికల్లో చిల్లర వ్యక్తుల కన్నా అధ్వాన్నంగా చంద్రబాబు వ్యవహారం ఉందన్న ఆయన.. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడగాలి.. కానీ, కేసీఆర్ తిట్టడమేంటి అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు... ఎన్టీఆర్‌ను మర్చిపోయారేమో గానీ, నిద్రలో కూడా కేసీఆర్ ను కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత కారణంగా అద్భుతమైన తీర్పు రాబోతోందన్నారు. అద్భుతంగా పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర నాయకులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్.