ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ మంత్రి లేఖ

ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ మంత్రి లేఖ

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ లేఖ రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో హుజూరాబాద్‌కు చెందిన దొంత రమేష్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించాలని కోరారు. రాష్ట్రానికి చెందిన భక్తులకు 18 ఏళ్లుగా రమేష్ తిరుమలలో సేవ చేస్తున్నారని ఈటెల తెలిపారు. టీటీడీ బోర్డు అభివృద్ధితోపాటు భక్తులకు సేవ చేయడంలో ఆయన ముందుంటారని వివరించారు.