ఎమ్మెల్యేలకు మంత్రులు ఫోన్

ఎమ్మెల్యేలకు మంత్రులు ఫోన్

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో  అసెంబ్లీ రద్దుకు ముహూర్తం కూడా ఖరారు అయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు మంత్రులు ఫోన్ కాల్స్ చేసినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలలో పెండింగ్ లో ఉన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను రేపు, ఎల్లుండిలోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను పార్టీ వర్గాలు ఆదేశించాయి. ఎమ్మెల్యేలందరూ ఎల్లుండి ఉదయం హైదరాబాదులో అందుబాటులో ఉండాలని మంత్రులు ఆదేశించినట్టు సమాచారం.