శాసన మండలి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

శాసన మండలి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో ఐదు శాసన మండలి స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఐదు స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, రియాజ్(మజ్లీస్) పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పోటీ చేయడం లేదు.

అయిదు స్థానాలకుగాను తెరాస నాలుగు స్థానాలకు పోటీ చేస్తూ, ఒక స్థానాన్ని మిత్రపక్షమైన మజ్లిస్‌కు కేటాయించింది. మరోవైపు కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇంతలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెరాస, మజ్లిస్‌ సభ్యులు గెలవడం ఖాయమైంది.