ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే... పోకిరీల తాటతీశారు... 

ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే... పోకిరీల తాటతీశారు... 

తెలంగాణలో దిశ సంఘటన తరువాత పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు.  రాష్ట్రంలో ప్రొటెక్షన్ పెంచారు.  మహిళల రక్షణ కోసం ఏ సమయంలోనైనా సరే 100 కి డయల్ చేయాలని, డయల్ చేస్తే వచ్చి తప్పకుండా రక్షిస్తామని అన్నారు.  అన్నట్టుగానే పోలీసులు ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతున్నారు.  ఎవరైనా సరే ఆపదలో ఉంటె చాలు 100 కి డయల్ చెయ్యొచ్చు.  ఇదిలా ఉంటె, హయత్ నగర్ బస్టాప్ వద్ద ఓ యువతిని పోకిరీఏడిపిస్తూ అల్లరి చేస్తున్నారు.  

దీంతో ఆ యువతి వెంటనే 100 కి డయల్ చేసింది.  100కి డయల్ చేసిన ఐదు నిమిషాల్లోనే పోలీసులు స్పాట్ కు వచ్చి పోకిరీకి బుద్దిచెప్పారు.  యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.  కొన్ని రోజుల క్రితం క్రితం కూడా ఇలాంటి సంఘటనే జరిగింది.  యువతి పెట్రోల్ అయ్యిపోయి బండి ఆగిపోతే వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది.  పోలీసులు పెట్రోల్ తీసుకొచ్చి ఆమె బైక్ లో పోసి ఆమెను సురక్షితంగా చేర్చారు.