తెలంగాణలో పోలింగ్‌ శాతం ఇదీ..

తెలంగాణలో పోలింగ్‌ శాతం ఇదీ..

సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ముగిసింది. మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది.. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.  వివిధ కారణాల వల్ల ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది. కడపటి వివరాలు అందేసరికి తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 62.25 శాతం ఓటింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలను ఇవాళ ప్రకటిస్తారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయానికి తెలంగాణలో పోలింగ్ శాతం ఇలా ఉంది. హైదరాబాద్‌లో 39.49శాతం, మల్కాజ్‌గిరిలో 42.75శాతం, చేవెళ్లలో 53.80శాతం, ఆదిలాబాద్‌లో 71.98శాతం, నిజామాబాద్‌లో 54.20శాతం, జహీరాబాద్‌లో 67.80శాతం, నాగర్‌కర్నూలులో 62.51శాతం, కరీంనగర్‌లో 69.40శాతం, పెద్దపల్లిలో 65.52శాతం, నల్లగొండలో 74.12శాతం, భువనగిరిలో 75.11శాతం, వరంగల్‌లో 60.00శాతం, మహబూబాబాద్‌లో 64.46శాతం, మహబూబ్‌నగర్‌లో 65.30 శాతం, ఖమ్మంలో 75.61 శాతం, మెదక్‌లో 71.56 శాతం, సికింద్రాబాద్‌లో 45.00 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.