తెలంగాణ జైళ్లశాఖ డీజీ బదిలీ..

తెలంగాణ జైళ్లశాఖ డీజీ బదిలీ..

తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్‌ను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం... జైళ్లశాఖ నుంచి ఆయను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. ఇక, 2014 జూన్ 6 నుంచి 2019 జులై 6 వరకు ఐదేళ్లకు పైగా ఆయన జైళ్లశాఖ డీజీగా పనిచేసి.. జైళ్లలో పలు సంక్కరణలు తీసుకొచ్చారు. కాగా.. తెలంగాణ కొత్త జైళ్లశాఖ ఇంచార్జ్ డీజీగా సందీప్ శాండిల్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సందీప్ శాండిల్య ప్రస్తుతం రైల్వే డీజీగా ఉన్నారు.