ఐదోరోజు రోడ్డెక్కని బస్సులు.. 

ఐదోరోజు రోడ్డెక్కని బస్సులు.. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  గత ఐదు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఈ సమ్మెకారణంగా బస్సులు రోడ్డెక్కలేదు.  దసరా సమయంలో బస్సులు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.  ఆర్టీసీ కార్మికులు దసరాకు ముందు సమ్మెకు దిగటంతో.. ప్రభుత్వం సీరియసైనా సంగతి తెలిసిందే.  ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రకటించింది.  

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో బస్సులను ప్రభుత్వం నడుపుతున్నది.  ఇక ప్రైవేట్ బస్సుల చార్జీలు మోతమోగుతున్నాయి.  డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు.  అదనపు చార్జీలు వసూలు చెయ్యొద్దని ప్రభుత్వం చెప్తున్నా యథేచ్ఛగా చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఈరోజు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీలు సమావేశం కానున్నారు.