సభలో ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం

సభలో ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం

అసెంబ్లీలో ప్రతి సభ్యునికి తప్పకుండా మాట్లాడే అవకాశం ఇస్తామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్ తో పాటుగా అన్ని పక్షాల నేతలకు ధన్యవాదాలు తెలిపారు.  రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేందుకు అన్ని రంగాలపై క్లుప్తంగా చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ లో సభ్యులందరు స్పీకర్ తో సహకరిస్తారని అభిప్రాయపడ్డారు. సభను హుందాగా నిర్వహిస్తాననే నమ్మకం ఉందన్నారు.  కేసీఆర్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేశాననీ.. ఇప్పుడు వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.  తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.  గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వ పాలనను అద్దం పట్టె విధంగా ఉందన్నారు. ప్రతి ఎమ్మెల్యే సభను వినియోగించుకోవాలన్నారు. సభ నియమాలు నిబంధనలపై కొత్త సభ్యులకు శిక్షణా తరగతులు ఉంటాయి అన్నారు. అవసరాన్ని బట్టి శాసన సభను పనిదినాలను నిర్వహిస్తామని పోచారం వెల్లడించారు.