తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల...

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల...

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ.. కాస్త ఆలస్యంగా ఎస్‌ఎస్‌సీ ఫలితాలను ప్రకటించింది. సచివాలయంలోని ‘డీ’ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి టెన్త్ ఫలితాలు విడుదల చేశారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో 92.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలుర ఉత్తీర్ణత 91.18 శాతంగా ఉండగా.. బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తానికి టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫలితాల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా టాప్ స్పాట్‌లో నిలచింది. జగిత్యాల జిల్లాలో 99.73 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు ఈ ఫలితాల్లో హైదరాబాద్‌ అట్టడుగు స్థానానికి పడిపోయింది. హైదరాబాద్‌లో ఉత్తీర్ణత శాతం 83 శాతంగా ఉంది.