టెన్త్‌ ఫలితాలకు కుదిరిన ముహూర్తం..

టెన్త్‌ ఫలితాలకు కుదిరిన ముహూర్తం..

ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలతో... ఆ వెంటనే విడుదల చేయాల్సిన టెన్త్ క్లాస్ (ఎస్ఎస్‌సీ) ఫలితాలను వాయిదా వేస్తూ వచ్చారు అధికారులు. ఇంటర్‌ ఫలితాల్లో లాగా.. ఎలాంటి అవకతవలకు అవకాశం లేకుండా.. అన్ని విధాలుగా చెక్ చేసిన తర్వాతే విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చిన అధికారులు. మొత్తానికి ఈ నెల 13వ తేదీన ఎస్‌ఎస్‌సీ ఫలితాలను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. 13వ తేదీన ఉదయం 11.30 గంటలకు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in. http://results.cgg.gov.in. లో చూసుకునే అవకాశం ఉంటుంది.