ప్రతిజ్ఞ చేసిన టీడీపీ అభ్యర్థులు...

ప్రతిజ్ఞ చేసిన టీడీపీ అభ్యర్థులు...

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మహాకూటమితో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు... హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో ప్రతిజ్ఞ చేశారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి... ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అభ్యర్థులు... భవ్య ఆనంద్ ప్రసాద్, నందమూరి సుహాసిని, గణేష్ గుప్తా, సామా రంగారెడ్డి, వీరేందర్‌గౌడ్‌ హాజరై పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. కాగా, కొత్తకోట దయాకర్‌రెడ్డికి బదులుగా ఆయన సతీమణి సీత దయాకర్‌రెడ్డి బీ ఫారమ్‌ తీసుకున్నారు. ఇక సండ్ర వెంకట వీరయ్య తరుపున ఆయన అనుచరుడు రామకృష్ణ బీఫారమ్‌ కోసం ట్రస్ట్‌ భవన్‌కు వచ్చారు. ఈ కార్యక్రమంలో టి.టీడీపీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.